Tweets by RajNewLive expr:class='"loading" + data:blog.mobileClass'>
Raj News Live YouTube Channel - http://www.youtube.com/c/RAJNEWSLIVETV Raj News Live YouTube Channel - http://www.youtube.com/c/RAJNEWSLIVETV

Featured Post

25, ఫిబ్రవరి 2020, మంగళవారం

అమెరికా అధ్యక్షుడి పర్యటన వేళ దిల్లీ రణరంగాన్ని తలపిస్తోంది

అమెరికా అధ్యక్షుడి పర్యటన వేళ దిల్లీ రణరంగాన్ని తలపిస్తోంది. ఈశాన్య దిల్లీలోని వేర్వేరు చోట్ల పౌర నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాళ్ల దాడులు, ఘర్షణల్లో ఇప్పటివరకు 10 మంది మరణించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.

దిల్లీలో సీఏఏ వ్యతిరేక ఘర్షణలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 160మందికి పైగా గాయపడ్డారు.రాళ్ల దాడులు....మౌజ్​పుర్​ మెట్రో స్టేషన్​ సమీపంలోని కబీర్​నగర్​లో స్థానికులను బెదిరిస్తూ దుకాణాలపై రాళ్లు విసిరాయి అల్లరి మూకలు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. బాబర్​పుర్, జాఫ్రాబాద్, ఖజూరీ ఖాస్ సహా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని సమచారం. ముందు జాగ్రత్త చర్యగా పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు.అల్లర్ల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఖజూరీ ఖాస్ ప్రాంతంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్​ బలగాలు కవాతు నిర్వహించాయి. ఖజూరీ ప్రాంతంలో 144 సెక్షన్​ విధించారు అధికారులు.అమిత్​షా సమీక్షపరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సమీక్షించారు. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​, లెఫ్టినెంట్​ గవర్నర్​ అనిల్ బైజాల్​, పోలీస్​ కమిషనర్​ అమూల్య పట్నాయక్​, కాంగ్రెస్ నేత సుభాష్ చోప్రా తదితరులతో సమావేశమయ్యారు. అనంతరం సీనియర్​ అధికారులతో భేటీ అయ్యారు షా.'సంయమనం పాటించండి'దిల్లీలో జరుగుతున్ హింసాత్మక ఘర్షణలపై యావత్​దేశం ఆందోళన చెందుతుందన్నారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. జాతిపిత మహాత్ముడు చూపిన అహింసమార్గంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు కేజ్రీవాల్. మహాత్ముడి సమాధి రాజ్​ఘాట్​ను సందర్శించి నివాళులు అర్పించారు.హెడ్ కానిస్టేబుల్​కు తుది వీడ్కోలు...సోమవారం మృతి చెందిన హెడ్​కానిస్టేబుల్ రతన్​లాల్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నేడు పూర్తయ్యాయి. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్​ బైజాల్​, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ అంతిమ సంస్కారాలకు హాజరయ్యారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Thanks for your expression,
Please subscribe to our Facebook,Twitter and YouTube Channel.

https://www.facebook.com/RajnewsTelugu/
https://twitter.com/RajnewsOfficial
http://www.youtube.com/c/RAJNEWSLIVETV